అప్పు కోసం మళ్లీ నిర్మలా సీతారామన్ ముందు మోకరిల్లిన బుగ్గన

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అప్పు కోసం మళ్లీ సెంట్రల్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు మోకరిల్లారు. నవంబర్ నెలకి డిసెంబర్ మొదటి వారాల్లో ఆంధ్రాకు అప్పు కోసం రిజర్వ్ బ్యాంకులో అనుమతించకపోతే రాష్ట్రాన్ని నడపలేమంటూ వేడుకున్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో నిజంగానే డబ్బులు లేవా?, ప్రభుత్వానికి పన్నులు రావడం లేదా?, ఆ మేరకు రాష్ట్రంలో ఉత్పత్తి క్రయాలు విక్రయాలు జరగటం లేదా?. అక్టోబర్ కాగ్ నివేదిక ప్రకారం 2021 -2022 సంవత్సరం ఆరు నెలల ఆదాయం 64.871 కోట్లతో పోలిస్తే ఈ సంవత్సరం ఆరు నెలల ఆదాయం 72.958 కోట్లు ఉందని అంటే మొత్తం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం పెరిగిందని చెప్తుంది. కేంద్ర పన్నుల వాటా ఆదాయం 3000 కోట్లు, జీఎస్టీ మరో3 వేల కోట్లతో ఇది సాధ్యమైందని చెప్తుంది. అదే కాగ్ తన రిపోర్టులో గత ఆర్థిక సంవత్సరం ఆంధ్రప్రదేశ్ మార్కెట్ నుంచి 39,933 కోట్ల అప్పు తీసుకుంటే ఈసంవత్సరం సెప్టెంబర్ దాకా 49.278 కోట్ల అప్పు చేసిందని కూడా చెప్తుంది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఆరు నెలల్లో 17000 కోట్ల ఆదాయం వచ్చిందని కాగ్ చెబుతుంటే, ఆంధ్రప్రదేశ్ కు ఈ అప్పుల బాదఎందుకు? వచిచిన ఆదాయం దేనికి ఖర్చు పెడుతున్నారు?. ఆంధ్రప్రదేశ్ ని ఏవిదంగా ముందుకు తీసుకపోతారు? అమాయక ప్రజలపై ఇంకా ఎన్ని పన్నులు మెాపుతారు?