నగరాభివృద్ధిపై నిశాంత్ కుమార్ ముద్ర ఉండాలి: గాదె వెంకటేశ్వరరావు

గుంటూరు నగరపాలక సంస్థ కమీషనర్ గా ఒక ఐఏయస్ అధికారి బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రజలు కూడా ఉన్నతస్థాయి అధికారి కమీషనర్ గా రావటం పట్ల ఎన్నో అంచనాలు పెట్టుకున్నారని, గుంటూరు నగర సమగ్రాభివృద్ధిపై నిశాంత్ కుమార్ ముద్ర ఉండాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అభిలాషించారు. నగరపాలక సంస్థ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నిశాంత్ కుమార్ ని జనసేన పార్టీ నాయకులు ఆయన చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేసి అభినందనలు తెలియచేసారు. ఈ సందర్భంగా కమీషనర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో నగరాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని అన్నారు. కమీషనర్ ని కలిసిన వారిలో కార్పొరేటర్లు పద్మావతి, లక్ష్మీ దుర్గ, జనసేన నాయకులు నక్కల వంశీ, ఆళ్ళ హరి, సూరి, శిఖా బాలు, దాసరి వాసు తదితరులున్నారు.