నిషార్ అహ్మద్ మాటతీరు సిగ్గుచేటు..!

మదనపల్లి, శనివార్మ్ మదనపల్లి ప్రెస్‌క్లబ్ నందు కూటమి నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు మాట్లాడుతూ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశ్యం పోసాని కృష్ణమురళి అరెస్ట్ గురించి మొన్న తెగ బాధపడిపోతూ మదనపల్లి వైసీపీ నాయకుడు నిసార్ అహ్మద్ మాట్లాడిన తీరుని చూసి షాక్ కి గురయ్యాము, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవారిని దారుణంగా సభ్య సమాజం సిగ్గు పడేలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన పోసాని ప్రముఖ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత, ఆరోగ్యం బాగాలేదు అంటే కూడా శివరాత్రి పండుగ రోజు అరెస్ట్ చేశారు ఇది కక్ష సాధింపు చర్య అంటున్నారు. ఏంటి సమాజానికి మీరు ఇస్తున్న సందేశం. ఒక రచయితకి తెలుగు భాష మీద ఎంత పట్టు ఉంటుంది, 65 ఏళ్ల వయసులో పోసాని మాట్లాడాల్సిన భాషా ఇది, మీ వైసీపి స్టాండ్ ఇదేనా, బూతులు మాట్లాడటమే మీ పార్టీ భావజాలమా, ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయడం మే మీ సిదంతమా, అధికార మదంతో ఇష్టాన్సరము నోటికి వచ్చినట్లు వాగేసి, అధికారం పోయాక నేను రాజకీయాలు నుంచి తప్పుకుంటాను అంటే వదిలేయాలా. ఇలాంటి నీచులకు చట్ట ప్రకారం శిక్ష విధించి బుద్ధి చెప్పి, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయి అనే మెసేజ్ సమాజానికి ఇవ్వాల్సిన అవసరం లేదా. మీ వైసీపి లాగా బూతులు స్క్రిప్టులు ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టించాలా. గత 5 సంవత్సరాలు మీరు చేసిన అరాచకం, తప్పుడు కేసులతో హింసీచడం, బూతులుతో రెచ్చిపోవడం వల్లే ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం చేసారు. అయినా ఇంకా మీకు బుద్ధి రాలేదు, మనము చేసిన తప్పులు ఏంటి, ఎందుకు ప్రజులు ఎందుకు ఇంత దారుణంగా ఓడించారు అని సమీక్ష చేసుకోవడం మానేసి. ఇంకా అదే అహంకార ధోరణితో వ్యహరిస్తున్న వైసీపి పార్టీ ని ప్రజలు చీదరించుకుంటున్నారు, మొన్న ఇంకో వైసీపీ నాయకుడు ధృవద శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారి పై నిరాధారమైన ఆరోపణలు చేశాడు, కూటమి నుంచి 50 కోట్లు వస్తున్నాయి అని అన్నాడు, ఇలా ప్యాకేజ్, పెళ్ళిలు అని తెగ ప్రచారం చేశారు ఏమి అయింది జనసేనకి 100 స్త్రీకి రేటుతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు, నువు ఇంకో సారి ఇలా నోరు పారేసుకుంటే, రాష్ట్రంలో ఉన్న జనసైనికులు అందరూ తగిన బుద్ధి చెపాల్సి వస్తుంది, డిఫేమేషన్ కేసులతో వస్తాం జాగ్రత్త కబర్ధర్ దువ్వాడ శ్రీనివాస్. 8. అసలు మిమ్మల్ని ఎవరు ఏమి చేయనక్కర లేదు, మీకు మీరే మీ చేష్టలతో సమాజానికి పట్టిన చీడ పురుగులులా మిగిలిపోతారు. 2029 ఎలక్షన్స్ తరువాత వైసీపీ పార్టీ భూస్థాపితం అవడం ఖాయం, మీ తొందర చేస్తుంటే అంతకి ముందే అయిపోయిన ఆశ్చర్యం లేదు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాయిని జగదీష్, పట్టణ కార్యదర్శి అర్జున, టిడిపి యువనాయకులు పసుపులేటి వినోద్ కుమార్, సోమశేఖర్, లిలకర్, డిస్ చంద్ర, సోను, నవాజ్, యాసిన్, ఉమా, సత్య, దినకర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment