నితిన్ పెళ్లి సుముహూర్తం

కరోనా కారణంగా హీరో నితిన్ పెళ్లి వాయిదా పడుతూ వస్తున్న తెలిసిన అందరికి విషయమే. దాదాపు 8 ఏళ్ళుగా ప్రేమలో ఉన్న… నితిన్, షాలినిలు సంవత్సరం క్రితమే ఇంట్లో వాళ్ళకు చెప్పి వివాహానికి ఒప్పించారు. వివాహానికి సంబంధించి ఎంగేజ్మెంట్ ఫిబ్రవరిలో జరుగగా… ఆ తర్వాత చాలా గ్రాండ్‌గా ఈ పెళ్లిని జరపాలని ఇరు కుటుంబ సభ్యులు ప్లాన్ చేశారు. కానీ కరోనా రూపంలో వారి ఆశ నెరవేరలేదు. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత గ్రాండ్‌గా నితిన్, షాలినీల పెళ్లి జరపాలని వాయిదా వేస్తూ వస్తున్నారు. కానీ కరోనా ఇప్పటిలో అంతం అయ్యేలా కనిపించడం లేదు. అందుకే ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ..  ఈ నెల జూలై రాత్రి 8:30 గంటలకు సుముహూర్తం నిర్ణయిoచి నితిన్, షాలినీల పెళ్లి జరపాలని కుటుంబ సభ్యులు ఫిక్సయ్యారు. ఇరు కుటుంబాలకు సంబంధించిన వారు మరియు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే ఈ పెళ్ళికి హాజరు కానున్నారు.