కార్తీతో జత కట్టబోతున్న నివేతా థామస్

టాలెంటెడ్ యాక్టర్ గా సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నివేతా థామస్. ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత హీరోయిన్ గా బిజీ అయ్యింది. దృశ్యం తమిళ్ రీమేక్ తో అందరి దృష్టిలో పడిన నివేతా థామస్ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులని పలకరిస్తుంది.

 జెంటిల్ మెన్  సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మంచి మార్కులు వేయించుకుంది. తరువాత నానితోనే నిన్నుకోరి సినిమాలో నటిగా తన పెర్ఫార్మెన్స్ తో మరోసారి సత్తా చాటింది. ఆ తరువాత జై లవకుశ సినిమాలో తారక్ తో జతకట్టే అవకాశాన్ని నివేతా సొంతం చేసుకుంది. అలాగే రజినీకాంత్ కూతురుగా దర్బార్ సినిమాలో మెస్మరైజ్ చేసింది.

ఓ వైపు పెద్ద సినిమాలలో నటిస్తూనే మంచి కంటెంట్ బెస్ట్ గా ఉన్న చిన్న సినిమాలు ఈ అమ్మడు చేసుకుంటూ వెళ్తుంది. కమర్షియల్ హీరోయిన్ అనే ముద్ర కంటే టాలెంటెడ్ హీరోయిన్ అనే గుర్తింపుని తెచ్చుకోవడానికి ఇష్టపడుతుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాతో అమ్మడుకి మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఇక సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాకి ఒకే చెప్పింది. అలాగే శ్వాస అనే చిన్న సినిమాకి కూడా కమిట్ అయ్యింది. ఇదిలా ఉంటే దర్బార్ సినిమా తరువాత ఇప్పుడు మరో తమిళ్ సినిమాకి నివేతా థామస్ ఒకే చెప్పింది. అయితే ఈ సారి కార్తీకి జోడీగా ఈ సినిమాలో కనిపించబోతుందని సమాచారం. యాక్షన్ కథాంశంతో తెరకెక్కే ఈ సినిమాతో కోలీవుడ్ లో కూడా హీరోయిన్ గా సక్సెస్ కావాలని నివేతా భావిస్తుంది. మరి ఆమెకి టాలీవుడ్ దొరికినంత బెస్ట్ స్పేస్ కోలీవుడ్ లో దొరుకుతుందో లేదో వేచి చూడాలి.