ఎంతటి వారున్నా వదిలేదు లేదు: ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఫార్మసిస్ట్ అంజలి, విధి నిర్వహణలో ఉండగా దీపక్ అనే సూపర్‌వైజర్ టార్చర్‌కు గురై ఆత్మహత్యాయత్నం చేసిన నేపథ్యంలో, రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరిస్థితి తెలుసుకున్నారు. ఆయన బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి, న్యాయం కోసం కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హోం మంత్రి, డీఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి ఘటనపై త్వరితగతిన విచారణ చేపట్టాలని కోరారు. అవసరమైతే ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విషయం తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఆసుపత్రి వైద్యనిపుణులతో అంజలి ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరిన ఎమ్మెల్యే, హాస్పిటల్ యాజమాన్యాన్ని బులిటెన్ విడుదల చేయాలని ఆదేశించారు.

Share this content:

Post Comment