టీకా పై అపోహలు వద్దు: గవర్నర్‌

కరోనా వ్యాక్సిన్‌ విషయంలో ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయని, వాటిని వదులుకోవాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. టీకా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని ఆమె స్పష్టంచేశారు. అపోహలకు పోకుండా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని గవర్నర్‌ సూచించారు. చాలా మంది తనను టీకా తీసుకున్నారా? అంటూ అడుగుతున్నారు. నేను సాధారణ పౌరురాలినే కాబట్టి తీసుకోలేదు. సాధారణ పౌరులకు ఇచ్చేసమయంలో తానూ టీకా వేయించుకుంటానని గవర్నర్‌ తెలిపారు.

సోమవారం సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో వ్యాక్సిన్‌ పంపిణీని గవర్నర్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ టీకాను తయారుచేసిన మన దేశం స్వయం సమృద్ధిని సాధించిదని అన్నారు. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌వారియర్స్‌ టీకా తీసుకునేందుకు భయపడొద్దని గవర్నర్‌ సూచించారు. ఇప్పటి వరకూ 18లక్షల మంది ఈఎస్‌ఐ సేవలు పొందినట్టు తెలిపారు.