సేఫ్టీ లేనటువంటి బిల్డింగులకి పర్మిషన్ ఇవ్వకూడదు: శంకర్ గౌడ్

తెలంగాణ, కూకట్ పల్లి, కె.పి.హెచ్.బి మెట్రో స్టేషన్ పక్కన ఉన్న బిల్డింగులో గల ఫర్నిచర్ షాపులో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న జనసైనికులు వెంటనే ఆ యొక్క ప్రాంతానికి వెళ్లి అక్కడున్న అగ్నిమాపక సిబ్బందికి మరియు పోలీసు శాఖ వారికి సహాయపడుతూ ఈ విషయాన్ని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి నేమూరి శంకర్ గౌడ్ కు సమాచారం అందించిన వెంటనే హుటాహుటిగా శంకర్ గౌడ్ ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడ ఉన్న పరిస్థితులను పర్యవేక్షించడం జరిగింది. ఈ విషయంపై శంకర్ గౌడ్ స్పందిస్తూ తరచూ హైదరాబాద్ ప్రాంతంలో ఇటువంటి అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని అగ్నిమాపక సదుపాయాలు, సేఫ్టీ లేనటువంటి బిల్డింగులకి పర్మిషన్ ఇవ్వకూడదని ప్రతి షాపులోను మంటలను నియంత్రించే పరికరాలు ఉండాలని అన్నారు. ఇది ప్రభుత్వం మరియు సంబంధిత అధికారుల బాధ్యత అని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నాగేంద్ర, కొల్లా శంకర్, వేముల మహేష్, వెంకటేశ్వరరావు, సాయి, సాలాది శంకర్, నాగూర్, రాము తదితరులు పాల్గొన్నారు.