కోట్ల రూపాయలకి పక్క రాష్ట్రాలకి తరలించడంలేదు..!

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మంగళవారం పత్రికా ముఖంగా మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డికి నమ్మకంగా పనిచేసిన మైనింగ్ ఏడి బాలాజీ నాయక్ ఇవిగో కాకాణి చేసిన అనుమతి లేని మైనింగ్ అక్రమాలకు అన్నవాళ్లు అప్పుడు ఎందుకు పట్టుకోలేదు. రెండు రోజుల ముందు సురాయిపాలెం రీచ్లో రెండు ఇసుక లారీలను అదుపులోకి తీసుకున్నామని మైనింగ్ ఏడి బాలాజీ నాయక్ సాక్షి మీడియా ద్వారా విడుదల చేయడం విడ్డూరంగా ఉంది. ఇసుక లారీలు పట్టుకున్నప్పుడు ఫైన్ వేసుకో, అదుపులోకి తీసుకో తప్పులేదు కానీ గత ఐదేళ్లు వైసిపి పాలనలో కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో చిట్టేపల్లి తిప్ప సగానికి మాయం ప్రభగిరిపట్నం తిప్ప మాయం వరదాపురం మైనింగ్ తెల్ల బంగారం కోట్ల రూపాయలు పర్మిషన్ లేకపోయినా, నాటు బాంబులతో బ్లాస్ట్ చేసి తరలింపు జరుగుతుంటే నాయక్ కి కనిపించలేదు. మరుపూరు మొగులూరు మైనింగ్ జరుగుతుంటే నిమ్మకు నీరు పెట్టినట్లు ఉన్న బాలాజీ నాయక్ ఆనాడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి తొత్తుగా పనిచేసి కనీసం ఒక 100 కోట్లు దాకా ఈయన కూడా సర్దుకున్నట్టున్నాడు. అందుకే ఆనాడు స్పందన లేకుండా ఉన్నాడేమో. కాకాణి నేడు ఇసుక డిమాండ్ లేకుండా ప్రశాంతంగా ట్రాక్టర్ల ద్వారా తోలుకుంటున్నారు. మీకు తెలుసో లేదో నీలాగా గుట్టలు దోచి కోట్ల రూపాయలకి పక్క రాష్ట్రాలకి తరలించడంలేదు. ఒకరోజు మీడియా సమావేశం పెడతావ్ ఇసుక లో 100 కోట్లు దోచుకున్నాడు సోమిరెడ్డి అని మాట్లాడతావు, ఇంకొక రోజు మీడియా సమావేశం పెడతావు వందల కోట్లు దోచుకునేందుకు వ్యూహం సిద్ధం చేస్తున్నాడని చెప్తావు మరి సిద్ధమైందా లేక దోపిడీ జరిగిందా అనేటువంటి వాస్తవం తెలుసుకోలేక తెలియక మతిభ్రమించి మీడియా సమావేశాలు పెడుతున్నట్లున్నావు. ఏదైనా వాస్తవం ఉంటే తీసుకురా నువ్వు చేసిన అవినీతి అక్రమాలు మైనింగ్ మాఫియాకి పొదలకూరు మండలంలోని అనేక ఆన్నవాళ్లు చూపించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సవినయంగా తెలియజేస్తూ మీడియా సమావేశం పెట్టేముందు పూర్తిస్థాయిలో జరుగుతుందా జరిగిందా అనేటువంటి విషయాన్ని స్పష్టత తెలుసుకో తెలియకపోతే మేము తెలియజేస్తామని అన్నారు.

Share this content:

Post Comment