నేష‌న‌ల్ సీడ్స్ కార్పొరేష‌న్‌లో 220 ట్రె‌యినీ పోస్టులకు నోటిఫికేష‌న్..

నేష‌న‌ల్ సీడ్స్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (NSCL)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 220 ట్రె‌యినీ పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన ద‌ర‌ఖాస్తుల గ‌డువును పొడిగించింది. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ  ఆగస్టు 31

మొత్తం పోస్టులు: 220

అసిస్టెంట్ (లీగ‌ల్‌): 3

మేనేజ్‌మెంట్ ట్రెయినీ: 39 (ప్రొడ‌క్ష‌న్‌-16, హార్టీక‌ల్చ‌ర్‌-1, మార్కెటింగ్-7, హెచ్ఆర్‌-2, అగ్రిక‌ల్చ‌ర్ ఇంజినీర్‌-4, సివిల్ ఇంజినీర్‌-1, క్వాలిటీ కంట్రోల్‌-2, మెటీరియ‌ల్ మేనేజ్‌మెంట్-3)

సీనియ‌ర్ ట్రెయినీ-59 (అగ్రిక‌ల్చ‌ర్‌-29, ప్లాంట్ ప్రొటెక్ష‌న్‌-3, హార్టిక‌ల్చ‌ర్‌-1, మార్కెటింగ్‌-10, హెర్‌-5, క్వాలిటీ కంట్రోల్‌-1, అకౌంట్స్‌-5)

డిప్లొమా ట్రె‌యినీ- 7 (అగ్రిక‌ల్చ‌ర్ ఇంజినీరింగ్‌-4, ఎల‌క్రిక‌ల్‌-3)

ట్రె‌యినీ- 104 (అగ్రిక‌ల్చ‌ర్‌-18, మార్కెటింగ్‌-17, అగ్రిక‌ల్చ‌ర్ స్టోర్స్‌-6, ప‌ర్చేజ్‌-2, టెక్నీషియ‌న్‌-27, స్టోర్స్ ఇంజినీరింగ్‌-9, స్టెనోగ్రాఫ‌ర్‌-13, క్వాలిటీ కంట్రోల్‌-3, డాటా ఎంట్రీ ఆప‌రేట‌ర్-3, అకౌంట్స్‌-6)

ట్రెయినీ మేట్‌-3

అర్హ‌త‌లు: పోస్టులను బట్టి విద్యార్హతలు మారుతూ ఉంటాయి. పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ తదితర విద్యార్హతలుండాలి.

వయసు: లీగ‌ల్ అసిస్టెంట్ పోస్టుకు 30 ఏళ్ల ‌లోపు, ట్రె‌యినీ మేట్‌కు 25 ఏళ్ల ‌లోపు, మిగిలిన పోస్టుల‌కు 27 ఏళ్ల లోపు ఉండాలి.

పోస్టింగ్ ప్ర‌దేశాలు: న‌్యూఢిల్లీలోని కార్పొరేట్ ఆఫీస్‌, దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాల‌యాల్లో పనిచేయాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: ఆగ‌స్టు 31, 2020

వెబ్‌సైట్‌: https://www.indiaseeds.com/ పూర్తి వివరాలను చూడగలరు.