ఓఎన్జీసీలో ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ONGC పెట్రో ఆడిషన్స్ లిమిటెడ్ (ఓపల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుల చేసింది. ఇందులో యూ అండ్ ఓ ఆపరేషన్స్, క్వాలిటీ ల్యాబ్స్, ఇన్స్ట్రుమెంటేషన్ మెయింటేనెన్స్, ఎలక్ట్రికల్ మెయింటేనెన్స్, ఎన్విరాన్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్, లీగల్, సెక్యూరిటీ సంబంధిత పోస్టులు ఉన్నాయి. పోస్టుల సంఖ్యను ఇంకా వెల్లడించలేదు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువడనుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 25
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 10
వెబ్సైట్: www.opalindia.in