NPCIL 206 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-NPCIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టైపెండియరీ ట్రైనీ, సైంటిఫిక్ అసిస్టెంట్, స్టెనో, సబ్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 206 ఖాళీలను ప్రకటించింది. రాజస్తాన్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

మొత్తం ఖాళీలు- 206

డిప్లొమా హోల్డర్- 120

సైంటిఫిక్ గ్రాడ్యుయేట్స్- 30సైంటిఫిక్ అసిస్టెంట్ సీ- 07

సైంటిఫిక్ అసిస్టెంట్ బీ- 19

అసిస్టెంట్ గ్రేడ్ 1 (హెచ్ఆర్)- 01

అసిస్టెంట్ గ్రేడ్ 1 (F&A)- 04

అసిస్టెంట్ గ్రేడ్ 1 (C&MM)- 05

స్టెనో గ్రేడ్ 1- 06

సబ్ ఆఫీసర్ బీ- 01

లీడింగ్ ఫైర్‌మ్యాన్- 03

డ్రైవర్ కమ్ పంబ్ ఆపరేటర్ కమ్ ఫైర్‌మ్యాన్- 10

దరఖాస్తు ప్రారంభం- 2020 నవంబర్ 3

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 నవంబర్ 24 సాయంత్రం 4 గంటలు

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా, డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు.

ఎంపిక విధానం- పోస్టును బట్టి ఎంపిక విధానం ఉంటుంది. కొన్ని పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉంది. మరికొన్ని పోస్టులకు రాతపరీక్షతో పాటు స్కిల్ టెస్ట్ ఉంటుంది. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

వేతనం- రూ.44,900 వరకు

పూర్తి వివరాలను న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ https://npcilcareers.co.in/ లో చూడొచ్చు. అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకున్న తర్వాత ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి.

అభ్యర్థులు ముందుగా https://npcilcareers.co.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

అందులో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి.

పోస్టును సెలెక్ట్ చేసుకోవాలి.

ఆ తర్వాత పేరు, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసు కోవాలి.