ఇప్పటం ఇళ్ళను కూల్చడం కక్షపూరిత చర్య

మదనపల్లి, జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చిన రైతులపై ప్రభుత్వం కక్ష కట్టింది. గ్రామం మొత్తం జనసేనకు మద్దతిస్తుండడంతో అవకాశం కల్పించుకొని మరి వేధింపులు మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం సభకు స్థలం ఇచ్చిన సమయంలోనే అధికార పార్టీ నాయకులతోపాటు స్థానిక ఎమ్మెల్యే నుండి ఇప్పటం గ్రామానికి హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే వారిని లెక్కచేయకుండా జనసేన ఆవిర్భావ సభ జరుపుకోవడానికి రైతులు స్థలాన్ని ఇవ్వడంతో జనసేన మద్దతు దారుల ఇళ్లను కూల్చివేతకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కనీసం బస్సు సౌకర్యం కూడా లేని ఆ గ్రామానికి ఇప్పటికే 70 అడుగుల రోడ్డు ఉంది ఇప్పుడు ఇంకా రోడ్డు విస్తరణ పేరుతో 120 అడుగులు విస్తరించాలని చెప్పి ఉదేశపూర్వకంగా పేదల ఇండ్లను అది కూడా రెండు మూడు గదులు ఉన్నటువంటి ఇళ్లను కూడా కూల్చివేస్తున్నారు. మూడు రోజుల క్రితం నాదెండ్ల మనోహర్ సభ నిర్వహించిన సమయంలో కూడా పవర్ కట్ చేశారు. ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చినందుకుగాను ఆ గ్రామానికి పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తానని అది కూడా ఆర్థిక సహాయాన్ని నేరుగా గ్రామపంచాయతీకి అందిస్తామని చెప్పారు అయితే అక్కడున్న అధికారులు మాత్రం గ్రామపంచాయతీకి కాకుండా సి ఆర్ డి ఏ అకౌంట్ కి అందజేయాలని అక్కడున్న జనసేన నాయకులతో ప్రభుత్వం తరఫున అధికారులు చెప్పారు. ఈ సందర్భంలోనే అక్కడున్న గ్రామస్తులు అభిప్రాయం తీసుకోవడానికి జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెళ్ళినప్పుడు పవర్ కట్ చేయడం జరిగింది. అయితే అనూహ్యంగా రెండు రోజుల్లోనే ఇలాంటి చర్యలు తీసుకొని ఇళ్ళు కూల్చే పని చేపట్టారు. దీనికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పందించారు. నోట్ రిలీజ్ చేశారు. రేపు ఇప్పటం గ్రామం సందర్శించనున్నారు. ప్రభుత్వం కూలిలి పోవడం ఖాయం అక్కడున్న లోకల్ వైసిపి నాయకత్వం యొక్క చర్యకు పాల్పడింది. ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అమరావతి రైతులకు అండగా ఉండటం కూడా ఓర్వలేని ఈ ప్రభుత్వం ఈ రాజకీయ డ్రామా ఆడుతుంది. వాటికి పరాకాష్టగానే ఈ యొక్క కూల్చివేత రాద్ధాంతం పవన్ కళ్యాణ్ ని నేరుగా ఎదుర్కోలేకే ప్రభుత్వం ఈ యొక్క కుట్రలకు పాల్పడుతుంది రాజకీయ పార్టీ నాయకులు రాజకీయాలు చేస్తారు, రాజకీయపరంగా ఎదుర్కోవాలి కానీ ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలు అణగదొక్కే చర్యలు ఏదో ఒక విధంగా తమ మాట నెగ్గించుకోవాలని చేస్తున్న ధోరణిని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని చిత్తూరు జిల్లా జనసేన కార్యదర్శి దారం అనిత అన్నారు.