జనసేన తరుపున జరిగే జనవాణి కార్యక్రమానికి మలేషియాలో ఇల్లీగల్గా ఇరుక్కుపోయిన చంద్రావతి గురించి ఒక అర్జీ రావటం జరిగింది. ఆమెను క్షేమంగా మన దేశం పంపే ఏర్పాట్లు చూడమని పార్టీ నుంచి మలేషియా జనసేన నాయకులను దాసరి రాము, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కాంటాక్ట్ అవ్వటం జరిగింది. మలేషియా జనసైనికులు స్పందించి జోహార్ బరులో ఉన్న ఆమెను జాగ్రత్తగా విడిపించి ఎంబసీ షెల్టర్ లో ఉంచడం జరిగింది. ఆమెను ఇండియా పంపడానికి ఫైన్ మరియు టిక్కెట్ నిమిత్తం రూపాయలు 1,22,500/- సమకూర్చి, ఆదివారం అనగా 16/03/25 న ఆమెను క్షేమంగా ఇండియాలో వాళ్ల కుటుంబీకులకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో అప్పగించడం జరిగింది. ఆమెను ఇండియా పంపడానికి ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, సింగపూర్ జనసైనికులు గిరిధర్ ఎన్నారై జనసేన మలేషియా వ్యవస్థాపకులు బొలిశెట్టి శ్రీరామ్ ఎన్నారై జనసేన మలేషియా టీమ్ ఆర్థికంగా సహకారం అందించడం జరిగింది.
Share this content:
Post Comment