గోపాల కృష్ణను సత్కరించిన పంతం నానాజీ

కాకినాడరూరల్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి బుల్లెట్ ప్రూఫ్ కారు ఏర్పాటు చేస్తున్న ఎన్నారై టీం సభ్యులు గుడపాటి గోపాల కృష్ణ కాకినాడ విచ్చేసి మర్యాద పూర్వకంగా కాకినాడ లో పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీని కలవడం జరిగింది. ఈ సందర్బంగా నానాజీ ఎన్నారై టీం పార్టీ అభివృద్ధికి వారు చేస్తున్న కృషిని అభినందిస్తూ గోపాల కృష్ణని దుశ్శాలువతో సత్కారం చేసి, శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చిరుకానుకగా అందించడం జరిగినది.