ఎన్టీఆర్ ట్రస్ట్ కీలక నిర్ణయం.. తెలంగాణలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లు

కరోనా బాధితుల సహాయార్థం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రెండు ఆక్సీజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని ఎన్‌టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ఆక్సీజన్ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నామని, తెలంగాణలో కూడా రెండు ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అనాథ శవాలకు అంతిమ సంస్కారం ఏర్పాటుకు సేవా విభాగం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. టెలిమెడిసిన్‌, మందుల పంపిణీ, కరోనా రోగులకు నిరంతర సేవలు చేస్తున్నట్లు చేప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కరోనా రోగులకు ఆన్‌లైన్ చికిత్స అందిస్తున్నామని చెప్పారు.