*జాతర ఏర్పాట్లపై సీఎం సానుకూల ప్రకటన హర్షనీయం: పిఆర్పీ గోవింద్
ఉత్తరాంధ్రలోని ప్రసిద్ధ దేవాలయం అయిన అనకాపల్లి శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, సీఎం నారా చంద్రబాబు నాయుడుకి వినతిపత్రం అందించగా, ఆయన సానుకూలంగా స్పందిస్తూ, నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని పిఏ రవిచంద్రను ఆదేశించగా, ప్రకటనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇటీవల సీఎంఓ నుండి లెటర్ రావడం నియోజకవర్గ ప్రజలకు అనకాపల్లి బెల్లం లాంటి తీపివార్త అని కశింకోట మండల జనసేన ప్రధాన కార్యదర్శి కర్రి గోవింద్ (పిఆర్పీ గోవింద్) అన్నారు. ఈ సందర్బంగా అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని సతీసమేతంగా దర్శించగా, ఆయనతో పాటు మండల జనసేన నాయకులు గొంతిన ఈశ్వరరావు, కలగ శ్రీనివాసరావు, అఖిల్ శ్రీను, మండే శ్రీను, కడిమి నాగ చిరంజీవి, రావి చంటి, మణికంఠ గూడెపు, గనిరెడ్డి దినేష్, పవన్ నాయుడు, మజ్జి బాబ్జి, కర్రి లోవరాజు, ఐనాల నాయుడు, ఊడి నూకరాజు, కొర్ని బెన్నయ్య, పిల్లి సతీష్, గుదిబండ జాన్, వీర మహిళలు శనివాడ లక్ష్మి, ఆశ తదితరులు అమ్మవారిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా అమ్మవారి ప్రస్థానం గురించి మాట్లాడుతూ తొమ్మిది శక్తి రూపాలలో ఒకటైన అనకాపల్లి శ్రీ నూకాలమ్మ జాతర రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని 2024 ఎలక్షన్ ప్రచారంలో పవన్ ఖళ్యాన గారి వారాహి యాత్రలో భాగంగా నాడు హామీ ఇచ్చి, అది నేడు ఇంత వేగంగా కార్యరూపం దాల్చడం అమ్మవారి అనుగ్రహంతో కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని, గెలిచిన అనంతరం అమ్మవారి దర్శనం చేసుకుంటానని నాడు చెప్పిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అమ్మవారిని దర్శించి అనంతరం అమ్మ ఆశీస్సులతో డిప్యూటీ సీఎంగా సేవలు అందించడం ఆనందంగా ఉందని పిఆర్పీ గోవింద్ అన్నారు. అనకాపల్లి నూకాంబిక ఆలయం అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటని, 1450 లో నిర్మించగా, 1611 లో కాకర్లపూడి అప్పలరాజు పాయకరావు ఆలయాన్ని పునరుద్దరించినట్లు చరిత్ర చెబుతోందని, 1937లో దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకున్న నాటి నుండి నేటి వరకు సుమారు 9 దశాబ్దాల అనకాపల్లి వాసుల కళను సాకారం చేసిన కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు గారికి, ప్రత్యేక చొరవ తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్, ఏపీయూఎఫ్ఐడిసీ చైర్మన్ పీలా గోవింద, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్, జనసేన ఇంచార్జ్, డైనమిక్ లీడర్ భీమరశెట్టి రాంకీ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Share this content:
Post Comment