విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఫోన్ చేయాల్సిన నంబర్లు

తెలంగాణలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాల్లోని ప్రాంతాలు నీట మునిగిన నేపథ్యంలో విద్యుత్ సంబంధిత ఫిర్యాదుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి పలు విషయాలను తెలిపారు. విద్యుత్ సరఫరాలో ఏవైనా సమస్యలుంటే తక్షణమే స్పందించాలని తెలిపారు. అందుకోసం ప్రత్యేక నంబర్లను కేటాయించారు.1912, 7382072104, 7382072106, 7382071574 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. ప్రజలు రోడ్లపై, భవనాలపై తెగి పడ్డ తీగల విషయం లో అప్రమత్తంగా ఉండాలన్నారు. వాటిని తాకకుండా విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలని సూచించారు. ప్రజలు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల, ట్రాన్స్ ఫార్మర్ లు, సర్వీస్ వైర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వోల్టేజ్ లో హెచ్చు తగ్గులు ఉన్నా, ట్రాన్స్ ఫార్మర్ ల వద్ద శబ్దం వస్తుంటే వెంటనే విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలని సీఎండీ రఘుమారెడ్డి సూచించారు.