మిర్చి రైతులను ఆదుకోవాలని ఎమ్మార్వోకి వినతిపత్రం అందించిన నూజివీడు జనసేన

నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలంలో రైతులు పడుతున్న కష్టాల గురించి తెలుసుకొనుటలో భాగంగా చాలా గ్రామాల్లో మిర్చిపంట వల్ల రైతులు నష్టపోవడం పరిశీలించటం జరిగింది. సంబంధిత ఎమ్మార్వోని వారి ఆఫీసులో, అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్ ఆఫీసర్ ని నరసింహారావు పాలెం గ్రామంలో కలిసి పంట సమస్యల గురించి వివరించి జనసేన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మండల అధికారి తెలిపిన వివరములు ప్రకారం మండలం ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న హార్టికల్చర్ అసిస్టెంట్ లను కలిసి మిర్చిపంట సంబంధిత ఈ-క్రాప్ చేసుకొని రైతులను గుర్తించి వారి పంటను ఆన్లైన్ చేయించవలసిన ఆవశ్యకత ఉందని తెలిపారు. కాబట్టి దీనిపై మండలంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి జనసేన నాయకులను ఈ బాధ్యత తీసుకొని గ్రామ సచివాలయాల్లో ఉండే హార్టికల్చర్ అసిస్టెంట్ కలిసి రైతుల పంట నష్టం వివరాలు వారికి తెలియజేసి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు అందజేసారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆరెల్లి కృష్ణ, తుమ్మల జగన్ మరియు చాట్రాయి, జనార్ధనవరం, నరసింహారావు పాలెం, గుడిపాడు రైతులు పాల్గొన్నారు.