పవన్ పర్యటనకు అభ్యంతరాలు అప్రజాస్వామికం

అమలాపురం: బుదవారం నుండి ప్రారంభం కానున్న ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటనకు ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కలుగచేస్తుంది. తొలి రోజు భీమవరం పర్యటనతో పాటు అమలాపురం పర్యటనకు కూడా ఆయన ప్రయాణించే హెలికాప్టర్ ల్యాండింగ్ అనుమతులు ఆర్ & బి అధికారులు అకారణంగా అనుమతులు ఇవ్వకపోవడాన్ని అమలాపురం జనసేన పార్టీ నాయకులు డి.యం.ఆర్.శేఖర్ మరియు ముఖ్య నాయకులు తీవ్రంగా ఖండించారు. అధికారులపై అధికార పక్షం ఒత్తిళ్లే కారణంగా మేము భావిస్తున్నాం. ప్రతిపక్షాన్ని ప్రతి అంశంలో ఈ ప్రభుత్వం అడ్డుకుంటుందని, ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనకు పెరుగుతున్న ఆదరణ పై అధికార పక్షం అడ్డుకునే కుట్ర పన్నుతుందని, అర చేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎవరూ ఆపలేరని, అలాగే ఈ పర్యటనను ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగించినా అంతకు పదిరెట్లు విజయవంతం అవుతుందని డి.యం.ఆర్. ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ల నాగ సతీష్, కంచిపల్లి అబ్బులు ఇసుక పట్ల రఘుబాబు, లింగోలు పండు, ఆకుల సూర్యనారాయణ మూర్తి, ఆర్.డి.యస్.ప్రసాద్, వాకపల్లి వెంకటేశ్వర రావు, డి.యస్.యన్.కుమార్, సత్తి చిన్నా తదితరులు పాల్గొన్నారు.