• సభ ఏర్పాట్లపై పార్టీ పీఏసీ ఛైర్మన్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దిశానిర్దేశం
పిఠాపురం వేదికగా మార్చి 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ వేడుకల సభా స్థలిని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ప్రధాన వేదిక నిర్మాణం, గ్యాలరీల ఏర్పాటుకి సంబంధించి పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగానికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా మహిళలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సభాస్థలి ప్రాంతానికి నేరుగా చేరుకునేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే లక్షలాది మంది పార్టీ శ్రేణులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. సభ కారణంగా ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం పార్టీ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ , నాయకులు వై.శ్రీనివాస్, బోడపాటి శివదత్, తలాటం సత్య, మండలి రాజేష్, తోట సత్యనారాయణ, శ్రీమతి చల్లా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment