ఘనంగా ఓబులేష్ జన్మదిన వేడుకలు

*టీడీపీ, జనసేన నాయకుల శుభాకాంక్షలు

కొండాపురం పంచాయతీ, ముద్దలకుంటపల్లి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఓబులేష్ జన్మదినాన్ని బుధవారం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గోరంట్ల నుండి జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యుడు పి. వెంకటేష్, టీడీపీ మాజీ ఎంపీటీసీ పి. వెంకటరంగ రెడ్డి, మల్లెల్ల నరేష్, కొండాపురం నాయకుడు మునీప్పా, రాగిమెకులపల్లి సూరి, గాజులవాండ్లపల్లి యువత నాయకుడు శ్రీనివాసులు, రాజు, ఫీల్డ్ అసిస్టెంట్ హరి, వానువోలు జిల్లా పరిషత్ హై స్కూల్ కమిటీ చైర్మన్ అంగజాల రామాజినేయులు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. పార్టీకి నిబద్ధతతో సేవలందిస్తున్న ఓబులేష్‌కు రాజకీయ, సమాజ సేవ రంగాల్లో ఇంకా పదులు పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Share this content:

Post Comment