అమలాపురం, గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ సుబ్బాలమ్మ అమ్మ వారికీ వెండి మకర తోరణం సమర్పించారు. అమలాపురం పట్టణ దేవతగా కొలువైన శ్రీశ్రీశ్రీ సుబ్బాలమ్మ అమ్మవారికి భక్తుల సహకారంతో 26 లక్షల విలువగల వెండి కిరీటాన్ని సమర్పించారు. సప్తమవార్షికోత్సవం సందర్భంగా తయారుచేసిన మకర తోరణాన్ని పురవీధులలో ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు కాల్దారి ప్రసాద్ ఆధ్వర్యంలో నవ చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పెద్దిరెడ్డి పుల్లయ్య నాయుడు. యుర్రంశెట్టి నారాయణమూర్తి, అరిగెల బాబ్జి, నిమ్మకాయల నాగేశ్వరరావు, ముత్యాల గంగాధర్, భాస్కర్ల రామకృష్ణ, అరిగెల చంద్రశేఖర్, టిడిపి జనసేన నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment