పేపకాయలపాలెం ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్న అధికారులు

కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్, కరప మండలం, కడప పంచాయతీ పరిధి పేపకాయల పాలెం గ్రామంలో ప్రజలందరూ త్రాగే మంచినీరు ప్రజలకు వదిలేదే మూడు, నాలుగు రోజులకు ఒకసారి. ఒక సమయపాలన లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు వదలడం జరుగుతుంది. పంచాయితీ సిబ్బంది గ్రామంలో వైసీపీ నాయకుల ఆజ్ఞతో చేస్తున్నారు. మంచినీరు శుభ్రంగా లేవు అని ప్రజలు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోకవడం లేదు. గతంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జెఇ, ఏఇ స్థాయి అధికారులకు స్వయంగా గ్రామంలో ఉన్న మంచినీటి ట్యాంకు వద్దకు తీసుకువచ్చి త్రాగు నీరు ఏ విధంగా ఉందొ చూపించి.. వివరించడం జరిగింది. గతంలో ఈ మంచినీళ్ళు త్రాగి పేపకాయలపాలెం గ్రామం వ్యాప్తంగా ప్రజలందరూ అనారోగ్యం పాలయ్యారు. వాస్తవానికి కరప మంచినీటి చెరువు నుండి మంచి నీటిని శుభ్రపరిచి చేయవలసి ఉన్నా చేయకుండా డైరెక్ట్ గా పేపకాయలపాలెం మంచినీటి ట్యాంక్ ఎక్కించి ప్రజలకు నీటిని వదిలేస్తున్నారు. పేపకాయలపాలెం ప్రజల ప్రాణాలతో అధికారులు ఆటలాడుకుంటున్నారు. గ్రామ పంచాయతీకి పన్నుల పేరుతో ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారు.. కానీ త్రాగే మంచి నీటిని కూడా శుభ్రంగా ఇవ్వలేకపోతున్నారు. పేపకాయలపాలెం గ్రామంలో మంచినీరు ఇదే విధంగా ఉంటే ప్రజలందరూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని పిలుపునిచ్చారు.