అధికారులు ఎన్నిక‌ల విధుల్లో నిష్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించాలి

  • పేద‌ల పించ‌న్ల పంపిణీలో కుట్ర‌
  • జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజీ

చిల‌క‌లూరిపేట‌: కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల విధుల్లో ఉన్న ఐదుగురు ఎస్పీ లు సహా ఆరుగురు ఐపీఎ్‌సలు, ముగ్గురు కలెక్టర్లను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయ‌టాన్ని జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజీ స్వాగ‌తించారు.. బుధ‌వారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ నిష్పక్షపాతంగా పనిచేస్తేనే ఎన్నికల విధుల్లో ఉంటారని, ఏపక్షంగా.. పక్షపాతంగా.. వ్యవహరిస్తే ఉపేక్షించబోమని ఎన్నికల కమిషన్ ఈ వ్య‌వ‌హారంతో స్ప‌ష్టం చేసిన‌ట్లైంద‌ని తెలిపారు. ఎన్నిక‌ల విధుల్లో ఈ అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌ని, ఇందువ‌ల్ల‌నే ఎన్నిక‌ల క‌మిష‌న్ ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలిపారు. ఎన్నిక‌ల విధుల్లో ఉన్న అధికారులు ఇక నైనా నిష్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని, ఏక ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తే ఇటువంటి చ‌ర్య‌లే పునరావృతం అవుతాయ‌ని హిత‌వు ప‌లికారు. పేద‌ల పింఛ‌న్ల పింపిణీలో కుట్ర‌. ఈ నెల‌లో సామాజిక ఫించ‌న్లు ఆల‌శ్యంగా ప్రారంభించ‌టంతో పాటు, స‌చివాల‌యాల వ‌ద్ద‌కు వ‌చ్చి తీసుకోవాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేయ‌డంప‌ట్ల బాలాజి తీవ్ర స్థాయిలో మండి ప‌డ్డారు. సచివాలయాల వద్ద పంపిణీ చేస్తే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర పింఛనుదారులు ఇబ్బందులు ప‌డ‌తార‌న్న ప్ర‌తిప‌క్షాల ఫిర్యాదుల‌ను సైతం ప‌ట్టించుకోకుండా ఏక ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకోవ‌డం అమానుష‌మ‌న్నారు. ఎండ‌లు పెరిగి సామాన్యులు సైతం బ‌య‌ట‌కు క‌ద‌ల‌లేని ప‌రిస్థితిలో ఉంటే వృద్ధుల‌ను పింఛ‌న్ కోసం ఎండ‌లో స‌చివాల‌యాల వ‌ద్ద‌కు రావాల‌ని ఆదేశాలు జారీ చేయ‌డం స‌రికాద‌న్నారు. సామాజిక పింఛ‌న్ల పంపిణీ కావాల‌ని స‌చివాల‌యాల వ‌ద్ద‌కు ఏర్పాటు చేసి, ఆ నెపాన్ని ప్ర‌తిప‌క్షాల‌పై నెట్టి వేసే కుట్ర జ‌రుగుతుంద‌ని ఆరోపించారు. ఈ విష‌యంపై పున‌రాలోచ‌న చేసి ఇంటివ‌ద్ద‌కే పింఛ‌న్ పంపిణీ చేయాల‌ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *