*మైనింగ్ కార్యకలాపాలపై విచారణ ప్రారంభం
*చోడవరం జనసేన ఇంచార్జి పివిఎస్ఎన్ రాజు పోరాటంతో అధికారుల్లో చలనం
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని రాజన్నపేట గ్రామంలో నడుస్తున్న క్వారీ కార్యకలాపాల వలన ప్రజలకు, రైతులకు ఏర్పడుతున్న తీవ్ర ఇబ్బందులపై జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గ ఇంచార్జి పివిఎస్ఎన్ రాజు చేసిన ఫిర్యాదుకు అధికారులు స్పందించారు. క్వారీ యజమానులు వ్యవసాయ చెరువు మధ్యగుండా అనధికారికంగా రహదారి నిర్మించడంవల్ల పంటలకు తీవ్ర నష్టం జరుగుతోందని, మైనింగ్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతూ, ఆయన అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ కృష్ణన్ కి వ్యక్తిగతంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో అధికారులు స్పందించి, కలెక్టర్ ఆదేశాల మేరకు మైనింగ్ మరియు నీటి పారుదల శాఖల అధికారులు రాజన్నపేటకు వెళ్లి క్షేత్రస్థాయిలో ఉమ్మడి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా అనేక అవకతవకలు బయటపడినట్టు అధికారులు పేర్కొన్నారు. దీంతో ఏప్రిల్ 17వ తేదీన రెవెన్యూ శాఖ అధికారులతో కూడిన మరింత లోతైన విచారణ నిర్వహించాలని నిర్ణయించి, లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఈ విచారణ కార్యక్రమంలో పివిఎస్ఎన్ రాజు ప్రతినిధిగా బుంగా కోటిబాబు, అలాగే స్థానిక నాయకులు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జనసేన పార్టీ ప్రజల సమస్యలపై ఎంతగానో కృషి చేస్తోందని, ఈ చర్యల వల్ల భవిష్యత్తులో రైతుల హక్కులకు న్యాయం జరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.
Share this content:
Post Comment