మార్చి 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు

జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను మార్చి 14వ తేదీన నిర్వహిస్తారు. పిఠాపురంలో ఈ వేడుకలను చేపట్టాలని పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం స్ట్రయిక్ రేట్ తో జనసేన విజయ బావుటా ఎగుర వేసింది. ఎన్నికల అనంతరం నిర్వహిస్తున్న ఆవిర్భావ సభ ఇది.

Share this content:

Post Comment