పుట్టిన రోజున మొక్కలునాటి పర్యావరణం పట్ల తన బాద్యతను చాటిన మహేష్ బాబు…

ఆగస్టు 9 తన పుట్టినరోజు ఆగస్టు 9 సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించి  తన నివాసంలో కొన్ని మొక్కలు నాటడంతో పాటు ఈ చాలెంజ్ కు మరో ముగ్గురిని నామినేట్ చేశారు. ఇదే విషయాన్ని మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా  ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ లో మహేష్ బాబు “నా పుట్టిన రోజును ఇంతకంటే మంచిగా సెలబ్రేట్ చేసుకోలేనేమో! అందుకే గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించాను. ఇప్పుడీ చాలెంజ్ ను స్వీకరించాల్సిందిగా జూనియర్ ఎన్టీఆర్, తమిళ హీరో విజయ్, శృతి హాసన్ లను నామినేట్ చేస్తున్నాను. ఈ చాలెంజ్ ను ఎల్లలు దాటించే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని మిమ్మల్నిందరినీ కోరుతున్నాను. పచ్చని ప్రపంచం కోసం ఒక్క అడుగు ముందుకు వేద్దాం” అంటూ పేర్కొన్నారు.