సిజి రాజశేఖర్ ఆద్వర్యంలో జగనన్న ఇళ్ళు పేదల కన్నీళ్లు

  • జగనన్న కాలనీలతో సాకారం కాని పేదల సొంతింటి కల
  • పేదలకు న్యాయం జరిగేందుకే జనసేన పార్టీ ఆధ్వర్యంలో సామాజిక పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టిన జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గ నాయకుడు సిజి రాజశేఖర్

పత్తికొండ: జనసేన పార్టీ ఆధ్వర్యంలో 12,13,14 తేదీలలో నిర్వహించు జగనన్న ఇల్లు-పేదలందరికీ కన్నీళ్లు #jagannaMosham అనే సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా మూడవరోజు సోమవారం వెల్దుర్తి మండలంలో పర్యటించడం జరిగింది. తదనంతరం జనసేన పార్టీ నాయకుడు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ.. వెల్దుర్తి గ్రామానికి సంబంధించిన వారికి, వెల్దుర్తి నుంచి బ్రహ్మగుండం దగ్గరగా అంటే సుమారు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో 350 దాక పట్టాలిచ్చారు, కానీ ఇక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి, ఎలాంటి ప్రయోజనం లేని చోట స్థలాలు ఇవ్వడం వల్ల, ఇంతవరకు అక్కడ పునాది కూడా వేయలేకపోతున్నారు, ఇల్లు ఎవరైనా గాని నిర్మించుకుంటే, తరతరాలకు నిలిచిపోయే విధంగా ఇల్లు నిర్మించుకుంటారు, కానీ ఇక్కడ ఆ ప్లేస్ ని చూసిన తర్వాత మాకు ఆశ్చర్యం కలిగించింది, నమ్మలేని విషయాలు చూశాం, కొండలు, గుట్టలు, పెద్ద పెద్ద బండ రాళ్లు, ఇల్లు స్థలాలు కేటాయించడం వల్ల ఇక్కడ ఎవరూ కూడా ఇల్లు నిర్మించుకోలేదని, మాకు తెలియజేశారు, ఇక్కడ ఇల్లు నిర్మించుకున్న తర్వాత బాత్రూంలకు వాటర్ సంపులు నిర్మించుకోవడానికి కూడా, రెండు ఇంచులు కూడా గుంతలు తీయలేని పరిస్థితి ఇప్పుడు చూశాం , ఇక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి, ఈ స్థలం సౌకర్యమైన స్థలం కాదని, ఈ స్థలం బదులుగా వేరేచోట ఎక్కడైనా సౌకర్యవంతమైన స్థలం తీసుకొని వెల్దుర్తి గ్రామ ప్రజలకు మంచి సౌకర్యంతో కూడిన ఇల్లు నిర్మించాలని, జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గం నుంచి డిమాండ్ చేశారు. జగనన్న కాలనీకి వెళ్లే రోడ్లో పెద్ద పెద్ద కంపు చెట్లు మలిచాయి, జగనన్న వెల్దుర్తి ప్రజలకు ఒక్క ఇల్లు కూడా నిర్మించే ప్రసక్తి ఇక్కడ లేదని ఈ ఐదు సంవత్సరాలు కాలక్షేపం చేసి అదిగో ఇదిగో అంటూ ప్రజలు మోసం చేసి పబ్బం పాపం గడపాలనుకుంటున్నారు అని అన్నారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు, నాయకల్ బాబ్జి , శివరాజు, కటార్ కొండ భాస్కర్, నాగేశ్వరరావు, చిరంజీవి, మధుసూదన్, మాలిక్ భాష, జీవన్ కుమార్, రాముడు, ఆంజనేయులు, మరియు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.