ఉరవకొండ జనసేన ఆద్వర్యంలో 3వ రోజు టిడ్కో ఇళ్ల పరిశీలన

  • జగనన్న కాలనీలలో క్షేత్రస్థాయిలో జరిగిన పనితీరుకు సచివాలయ సిబ్బంది చూపే లెక్కలకు ఏమాత్రం పొంతన లేదు.. జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్

ఉరవకొండ: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు, జిల్లా అధ్యక్షుల టి సి వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు సుదన్ రెడ్డి ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో 12,13,14 తేదీలలో నిర్వహించిన జగనన్న ఇల్లు-పేదలందరికీ కన్నీళ్లు అనే సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ 14వ తేది మూడవ రోజు సోషల్ ఆడిట్లో భాగంగా ఉరవకొండ నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలోని సచివాలయాలకి వెళ్లి సదరు గ్రామంలో ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంపిక అనుసరించిన విధానాలు ఏమిటి, ఇప్పటివరకు లబ్ధిదారులకు ఎంత మేరకు బిల్లులు మంజూరు చేశారు వంటి విషయాలను సచివాలయ, హౌసింగ్ అధికారులను సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షలు చంద్రశేఖర్, నాయకులు దేవేంద్ర, రాజేష్, అబ్దుల్లా, మల్లికార్జున, వెంకీ, ప్రియతమ, మునికుమర్, బోగేష్, బూపేష్, తదితరులు పాల్గొనడం జరిగింది.