కొటికలపూడి గోవిందరావు పుట్టినరోజు సందర్భంగా.. పలు సేవాకార్యక్రమాల నిర్వహణ

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు(చినబాబు) పుట్టినరోజు సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ మహిళా విభాగం జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీమతి ఉలుసు సౌజన్య జిల్లా కార్యదర్శి తులా చినబాబు సంయుక్త కార్యదర్శి కాకర్ల నాని మరియు నిడదవోలు రూరల్ మండల అధ్యక్షులు పొలిరెడ్డి వెంకటరత్నం ఆధ్వర్యంలో.. మానసిక వికలాంగుల ఆశ్రమంలో పండ్లు పంచిపెట్టడం మరియు సుశీల వృద్దాశ్రమంలో భోజనాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ జనసేన నాయకులు పూర్ణ, రాజశేఖర్ మరియు షణ్ముఖ్ పాల్గొన్నారు.