రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భముగా పంచదార చినబాబుకి సన్మానం

రాజోలు, డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ గ్రామానికి చెందిన జనసేన నాయకులు పంచదార చినబాబు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లచే “సన్మాన సత్కారాన్ని” అందుకున్నారు. పొదలాడ గ్రామానికి చెందిన పంచదార చినబాబు చేసిన సేవలు మన అందరికీ ఆదర్శనీయమని చినబాబు కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో ఆక్సిజన్ సిలిండర్స్ ఎంతో మందికి తన సొంత ఖర్చులతో అందచేశారు. చినబాబు మాట్లాడుతూ జనం మెచ్చిన నాయకులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ మాకు ఆదర్శమని, ప్రజలకు మేలు చేయాలనే ఆయన సిద్ధాంతం నమ్మి సేవా కార్యక్రమాలు పూర్తి చేసినందుకు ఈ పురస్కారం లభించిందని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో చినబాబుకి జనసేన నాయకులు, పొదలాడ గ్రామ ప్రజలు అందరూ హృదయపూర్వక అభినందనలు తెలియచేశారు.