రెండవ రోజు కొనసాగుతున్న జనసేన శ్రేణుల దీక్ష

అవనిగడ్డ – కోడూరు ప్రధాన రహదారి నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరుతూ అవనిగడ్డ నియోజక వర్గ జనసేన ఆధ్వర్యంలో బుధవారం నుండి రిలే నిరాహార దీక్ష ప్రారంభించిన విషయం విధితమే. టెండర్లు పూర్తి అయి, పని ప్రారంభించే సమయంలో దీక్షలు చేయడం హాస్యాస్పదం అని నిన్న వైసీపీ నాయకులు చేసిన విమర్శలపై జనసేన నాయకులు ఘాటుగా స్పందించారు. గడిచిన ఏడు సంవత్సరాల నుండి రహదారి డ్యామేజ్ అయి ప్రజలు నరక యాతన అనుభవిస్తుంటే, టెండర్లు పూర్తి అయితే ప్రజలకు ఎందుకు బహిరంగ పరచలేదని నిలదీశారు. సీఎం జగన్ మంజూరు చేసిన 35 కోట్లకు టెండర్లు పూర్తి అయినాయా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంజూరు చేసిన 20 కోట్లకు టెండర్లు పూర్తి అయినాయా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వేల మంది ప్రజలు నిత్యం ఈ రహదారి మీద ప్రయాణం చేయలేక నానా అవస్థలు పడుతుంటే రహస్యంగా పని ప్రారంభించాల్సిన అవసరం ఏముంది వెంటనే కాంటాక్ట్ వివరాలు బహిరంగ పరచాలని లేని పక్షంలో అబద్ధం చెప్పామని ప్రజలకు క్షమాపణ చెప్పాలని హితవు పలికారు. రోడ్డు పనులు ప్రారంభించే వరకు వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. గురువారం అవనిగడ్డ మండల జనసైనికులు దీక్షలో కూర్చున్నారని, సుక్రవారం మోపిదేవి మండల జనసైనికులు దీక్షను కొనసాగిస్తారని అవనిగడ్డ మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు తెలిపారు. ఈ దీక్షకు మచిలీపట్నం జనసేన పార్టీ సంఘీ భావం ప్రకటించినది. రెండవ రోజు దీక్షకు మచిలీపట్నం పార్టీ ఇంచార్జీ బండి రామకృష్ణ దీక్షా శిబిరానికి విచ్చేసి, సంఘీభావం తెలిపి, నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో మోదు మూడి గ్రామ సర్పంచ్ బచ్చు బేబీ, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కమిటీ కార్యదర్శి లంకె యుగంధర్, జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి బాసు నాంచారయ్య నాయుడు, కమిటీ సంయుక్త కార్యదర్శి ఉస్మాన్ షరీఫ్, కోడూరు మండల పార్టీ అధ్యక్షులు మర్రె గంగయ్య, మోపిదేవి మండల పార్టీ అధ్యక్షులు పూశడపు రత్నగోపాల్, ఎంపీటీసీ బొప్పన భాను, ఎంపీటీసీ కటికల వసంత్, బాదర్ల లోలాక్షుడు, కమతం నరేష్, తుంగల నరేష్, కోసూరి అవినాష్, గుగ్గిలం అనీల్, కమ్మిలి సాయి భార్గవ, బొప్పన పృద్వి, గౌస్ కాటమ, బచ్చు ప్రశాంత్, బచ్చు శ్రీహరి, పవన్ కళ్యాణ్, మండలి ఉదయ్ బచ్చు మురళి, యక్కటి నాగరాజు, రాజనాల వీరబాబు, తోట ఆంజనేయులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.