మరోసారి ‘పెండ్లిసందడి’ లో శ్రీకాంత్

దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు మరోసారి పెండ్లి సందడితో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ కుమారుడు రోషన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్ ను ఫైనల్ చేయాల్సి ఉంది. రాఘవేంద్రరావు అసిస్టెంట్స్ లో ఒకరు ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికరమైన అప్ డేట్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పెండ్లిసందడిలో అలనాటి హీరో శ్రీకాంత్ మరోసారి కీ రోల్ లో కనిపించనున్నాడట. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో 1996లో వచ్చిన పెండ్లి సందడి చిత్రం శ్రీకాంత్ కు హీరోగా మంచి బ్రేక్ ఇచ్చింది.

ఇపుడు ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ మరోసారి కనిపిస్తానడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగిపోతుంది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో శ్రీకాంత్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస సినిమాల్లో నటిస్తూ టాప్ హీరోగా ప్రేక్షకుల మన్ననలు పొందాడు.