వైసీపీకి ఒక న్యాయం, జనసేనకు వేరొక న్యాయమా..?

నెల్లిమర్ల నియోజకవర్గం: వైసీపీ నాయకులకు ఒక న్యాయం, జనసేన నాయకులకు వేరొక న్యాయమా..? అని నెల్లిమర్ల జనసేన నాయకులు డి.ఎస్.పిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెంకాడ గ్రామంలో మూడు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్దం చేసిన వైసీపీ నాయకులు, వాలంటీర్లపై మరియు నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుపై ఎస్పీ కి కంప్లైంట్ ఇచ్చినా ఆయన నుండి ఎటువంటి స్పందనా లేదు. సతివాడలో పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మను దగ్దం చేసిన వారిపై కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తే మాత్రం అరెస్టులు చేస్తున్నారు. వైసీపీ కి ఒక న్యాయం, జనసేన కు ఒక న్యాయమా అని ప్రశ్నింస్తున్నాం. ఏది ఏదైనా ఎఫ్.ఐ.ఆర్ కాపీ ఇచ్చినంత వరకు ఇక్కడ నుండి కదిలేది లేదు అని నెల్లిమర్ల నియోజకవర్గం నాయకురాలు లోకం మాధవి, ఉత్తరాంధ్ర మహిళ నాయకురాలు తుమ్మి లక్ష్మీ రాజ్ మరియు జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు డి.ఎస్.పి ఆఫీస్ ముందు బైఠాయించడం జరిగింది. అనంతరం నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ బేటాయించి ఎస్.ఐకి కంప్లైంట్ ఇచ్చి రిసిప్ట్ లు తీసుకోవడం జరిగింది.