జగ్గయ్యపేట మండలం, జయంతిపురం రాంకో సిమెంట్స్ కంపెనీ వారి ఈస్ట్ బ్యాండ్ మైన్స్ విస్తరణకు సంబంధించిన పర్యావరణ సంబంధిత ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను మరియు జనసేన యువనాయకులు సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయభాను మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాలుగా నడపబడుతున్న రాంకో సిమెంట్స్ కంపెనీ జగ్గయ్యపేట మండల పరిధిలోని పట్టణ, గ్రామాలకు ఉపాధి మరియు ఇతర సేవ కార్యక్రమాల్లో ముందు వరసలో నిలుస్తుంది. అలాగే ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న లైమ్ స్టోన్ గనులకు సంబంధించి పర్యావరణంకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా లక్ష మొక్కలను పరిసర ప్రాంతాలలో నాటాలని కోరారు. తాను శాసనసభ్యునిగా ఉన్న సమయంలో జరిగిన పబ్లిక్ హియరింగ్ లో రాంకో సిమెంట్స్ యాజమాన్యాన్ని స్థానిక యువతకు ఉపాధి నైపుణ్యం కొరకు సిమెంట్ టెక్నాలజీకి సంబంధించిన ఒక ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణం చేయవలసినదిగా కొరడమైనది. కానీ ఇంతవరకు ఎలాంటి కార్యరూపం దాల్చలేదని తెలిపారు. ఈ ప్రాంతం వారి శ్రేయస్సు కొరకు కంపెనీ యాజమాన్యం వారు ఒక ఇంజనీరింగ్ కళాశాల, ఒక అందమైన ఆహ్లాదకరమైన పార్కు మరియు లక్ష మొక్కలను చుట్టుప్రక్కల ప్రాంతాలలో పెంచాలని కోరారు.
Share this content:
Post Comment