ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో విజ్ఞత ఉండాలి

గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో గాదె మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలంటే ప్రజల కోసం పని చెయ్యాలి. రాజకీయ పార్టీలు స్వలాభం కోసం, స్వార్ధపూరితంగా పార్టీలు పెడితే వారి భాష ఎలా ఉంటుంది అనడానికి నిదర్శనం నిన్న కురుపాంలో జరిగిన ముఖ్యమంత్రి గారి బటన్ నొక్కే కార్యక్రమం. 99.5% మేర చేసేసాను అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు. నిన్న ఆయన మాట్లాడిన తీరు ఆయన అసహనాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ముఖ్యమంత్రి హోదాలో ఏర్పాటై చేసిన ప్రభుత్వ సభలో ఏమి మాట్లాడాలో ఎలా మాట్లాడాలో విజ్ఞత ఉండాలి, అది కనపడట్లేదు. 99.5 % లో ఏమేమి చేసారని అడిగితే ఒకటే పాట బటన్ నొక్కాను, డబ్బులు పడ్డాయి హామీలు నెరవేర్చేసాను అని చేతులు దులిపేసుకుంటున్నారు. ఇంగిత జ్ఞానం లేకుండా చిన్న పిల్లల ముందు ఎటువంటి మటలు మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడేస్తున్నారు. దత్తపుత్రుడు కథ అయిపొయింది, జనం పట్టించుకోవట్లేదు అని వార్త వచ్చినట్టుంది ఇప్పుడు నాలుగు పెళ్లిళ్లు అంటూ కొత్త కథతో వచ్చారు. ఆ నాలుగో వ్యక్తి ఎవరా అని చుస్తే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి రంకుమొగుడిగా తయారయ్యారన్న భావన కలుగుతుంది. జగన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం ఆ నాలుగో భార్య ఎవరో సమాధానం చెప్పాలి.. ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడాలి. మీరు మాట్లాడిన మాటలు నిజం అని నిరూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. “నిద్ర లేని రాత్రులు గడుపుతున్న ముఖ్యమంత్రి గారికి రంకు మొగుడిలా పవన్ కళ్యాణ్ గారు తయారయ్యారు అనేది స్పష్టంగా మాకైతే అనిపిస్తుంది. బుధవారం సభలో సానుభూతి కోసం పరితపించారు ముఖ్యమంత్రి గారు. ఇంతకముందు మా నాన్న చనిపోయాడు, తండ్రి లేని కొడుకుని అని మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు అదే గేమ్ ప్లే చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్ధం అవుతుంది. అసెంబ్లీ లోకి అడుగు పెట్టని పవన్ కళ్యాణ్ గారిని నువ్వు విమర్శిస్తున్నావంటే ఆయన నిన్ను ఎంత బయపెట్టాడో స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఏ సభ పెట్టినా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నావంటే అర్ధం అవుతుంది ఆ మనిషి అంటే, ఆ మనిషి పేరు వింటే గుండెల్లో ఎంత వణుకు పుడుతుందో స్పష్టంగా తెలుస్తుంది. పునాదుల గురించి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు నిన్న.. మీ పునాదులు ఏంటి?. మీ పార్టీ పునాదులు అవినీతి సంపదతో పుట్టినవి కాదా?.. అడుగుతున్నాం చెప్పే దమ్ముందా?.. మీ మీద ఉన్న కేసులు ఏంటి? మిమ్మల్ని దొంగగా పరిగణించి మీ మీద కేసులు పెట్టిన మాట వాస్తవం కాదా? పవన్ కళ్యాణ్ గారు మీసాలు మెలేస్తారు అని మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు.. అవును ఆయన దొర.. దొర కాబట్టే మీసం మేలెయ్యగలుగుతున్నారు. దొంగగా ఉన్న నువ్వు ఎలా మీసాలు మెలేస్తావ్, ఎలా తొడలు కొడతావ్? దొంగలు ఎప్పుడూ దర్జాగా, హుందాగా బ్రతకలేరు. భయం భయంగానే బ్రతుకుతారు. రేపటి రోజున ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించబోతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో అసత్యాలు మాట్లాడుతున్నారు జగన్ రెడ్డి గారు. గతంలో ఎప్పుడు వసతి దీవెనలు లేవంట.. నేను మీకు మేనమామని అని చెప్పుకుంటున్నారు ఏ విధంగా మీరు మేనమామ అవుతారు?. మాట్లాడితే నా ఎస్సీలు, నా బీసీలు అంటారు.. వారికీ మీరు ఏం చేసారు చెప్పండి ముఖ్యమంత్రి గారూ. అంబేద్కర్ విదేశీ విద్య దీవెన పథకానికి పేరు మర్చి మీ పేర్లు పెట్టుకున్నావు ఏ అర్హతతో పెట్టుకున్నావు? సమాధానం చెప్పాలి. ఇన్ని తప్పులు చేసినా మేము జనసేన పార్టీ కార్యకర్తలుగా ఏ రోజూ మీ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడలేదు దయచేసి మమ్మల్ని ఆ స్థితికి లాగొద్దు. రాజకీయంగా ఎదుర్కో ప్రజల మధ్యకి రా అక్కడ తేల్చుకుందాం అంతే గాని చిన్న పిల్లలతో సభ పెట్టి నిస్సిగ్గుగా మాట్లాడితే ప్రజలు మీకు బుడ్డి చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు విరామం మధ్యలో వస్తారు అని ఆరోపించారు మన ముఖ్యమంత్రి గారు. అలా చేస్తేనే మీకు తడిచిపోతుంది. ఇంకో 10 రోజులు ఉంటె మీకు ఊపిరి ఆడదు. స్మార్ట్ కార్డు పేరిట ప్రతి మనిషి దగ్గర 260 చొప్పున మీరు వసూలు చేసిన కోట్లాది రూపాయలు ఏమయిపోయ్యాయి?. నువ్వు సమాధానం చెప్తావా, మీ మంతులు చెప్తారా?. రిజిస్ట్రేషన్ శాఖలో ప్రతి ప్రాంతానికి వెళ్లాల్సిన సొమ్ము ఏమైపోయింది సమాధానం చెప్పే దమ్ము ఉందా?.. జనసేన అంటే జనం కోసం పుట్టిన పార్టీ. జనం కోసమే మేము గొంతు ఎత్తుతాం, మా అధినాయకుడి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఊరుకున్నది లేదు అని స్పష్టంగా తెలియజేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా. మాణిక్యాలరావు, సిరిగిరి శ్రీనివాస్, కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి, మధులాల్, శ్రీపతి భూషయ్య, నెల్లూరు రాజేష్ పాల్గొన్నారు.