ఓఎన్ జిసి సంస్థ పై యుద్దానికి రెడీ

రాజోలు: సముద్ర తీర ప్రాంతాలైన అంతర్వేది, పల్లిపాలెం, అంతర్వేది, కేశవదాసు పాలెం, చింతలమోరి గ్రామ సర్పంచ్ లు ఎంపీటీసీలు సమావేశం జరిగింది. గ్రామాలలో ఉప్పునీటితో ఉండడం వలన, బోరు బావులు కూడా ఉప్పునీరు రావడంతో ప్రజలు త్రాగునీరు లేక నానాఇబ్బందులు పడుతున్నారు. అలాగే రోడ్లులేక ఇసుకపుంతలలో వెళ్లే పరిస్థితి ఈ ఓఎన్ జిసి కార్యకాలపాలు కూడా అంతర్వేది, కేశవదాసుపాలెం లలో ఎక్కువగా ఉండడంతో ఇక్కడ ఎక్కువ కాలుష్యం ఉండడంతో ఈ గ్రామాలలో ప్రజలు అనేక రోగాల పాలున పడుతున్నారు. కావున ఈ కమిటీ సభ్యులందరూ మా గ్రామాలకు ఓటర్ హెడ్ ట్యాంకులు నిర్మించే విధంగా నిధులు కేటాయించి, ప్రజలకు ఓఎన్ జిసి సంస్థ ద్వారా నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండేలాగా ఆగ్రామ అభివృద్ధికి సహకరించగలరు అని కోరుచున్నాము. లేకపోతే ఓఎన్ జిసి కార్య కలాపాలు అడ్డుకుంటాం అని తీర్మానం చేశారు.