కాలేజీ విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు

తెలంగాణా ప్రభుత్వం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి డిజిటల్, టీవీ, టీశాట్ మాధ్యమాల ద్వారా వీడియో పాఠాలు ప్రారంభించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు, కాలేజీ విద్య కమిషనర్, అన్ని యూనివర్సిటీలకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 27 నుంచే బోధన సిబ్బంది విధులకు హాజరై డిజిటల్, ఈ-లెర్నింగ్ ప్రణాళికలు తయారు చేయాలని స్పష్టం చేశారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇంటర్ సెకండియర్‌తోపాటు డిగ్రీ, పీజీ సీనియర్ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి.