- జనసేన పార్టీ నాయకురాలు తిరుపతి అనూష
విజయవాడ, ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇస్తేనే వస్తుంది.. ఎవరో కావాలని పట్టుబడితే.. ధర్నాలు, వాకౌట్లు చేస్తే వచ్చేది కాదని జనసేన పార్టీ నాయకులు తిరుపతి అనూష అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందని, అప్పటి వైసీపీ ప్రభుత్వం అవినీతి, అరాచక, దుర్మార్గ పాలనను ప్రజలు గమనించి ఓటు అనే అయుధంతో వైసీపీకి చావు దెబ్బ కోట్టి కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని గుర్తు చేశారు. 2019లో 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ 11 సీట్లకే పరిమితం చేసిన జగన్ రెడ్డి ఆలోచన తీరు, ప్రవర్తన కొంచెం కూడా మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా గవన్నర్ ప్రసంగం చేస్తున్న వైసీపీ ప్రవర్తించిన తీరు సబబుగా లేదన్నారు. 2024 ఎన్నికల్లో గెలిచిన పార్టీల్లో అసెంబ్లీలో రెండో పెద్ద పార్టీ జనసేన అని, పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచిందని గుర్తు చేశారు. మరి 21 సీట్లు గెలిచిన జనసేనను కాదని.. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో అత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకే జగన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారని, వచ్చిన 2 నిమిషాలకే తిరుగుముఖం పట్టి “మ్యాగీ జగన్ రెడ్డి”గా పేరు సంపదించుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై జగన్ రెడ్డి అండ్ టీం అసెంబ్లీలో మాట్లాడేందుకు భయపడుతున్నారు. కానీ, వాస్తవానికి జగన్ రెడ్డి హయాంలో జరిగిన లోటుపాట్లు గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయంతోనే మొహం చాటేస్తున్నారన్నారు. అలాగే మళ్లీ తన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటున్నారని, అది జనసేన పార్టీ మనుగడలో ఉన్నంత వరకు జరిగే పని కాదని హితవు పలికారు. అధికారంలోకి రావడం గురించి ఆలోచన మానేసి కనీసం పులివెందులలో అయిన ఓడిపోకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు.
Share this content:
Post Comment