సర్పంచ్ నుండి రికవరీ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ

అన్నమయ్య జిల్లా, వీరబల్లి మండలం, సానిపాయి గ్రామపంచాయతీలో డి.ఈ మరియు ఏ.ఈ వారి నకిలీ సంతకములతో దాదాపు 18.7 లక్షల రూపాయలు గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి నిధులు దుర్వినియోగం చేశారని దానిపై విచారణ చేసి తగు చర్యలు చేపట్టవలసిందిగా కోరుతూ ఫిబ్రవరి 17న నేతి రామ్మోహన్, జిల్లా సంయుక్త కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగినది. దీనికి స్పందించిన సంయుక్త కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విచారణ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.ఆర్.ఐ రాజంపేట డివిజన్ వారు మొత్తం 18.7 లక్షల రూపాయలకు సంబంధించి నకిలీ మరియు ఫ్యాబ్రికేటెడ్ రికార్డులని వాటి యందు డి.ఈ మరియు ఏ.ఈ సంతకంలో నకిలీవని నివేదికను తదుపరి చర్యల నిమిత్తం సమర్పించి ఉన్నారు. ఈ నివేదికను జిల్లా పంచాయతీ అధికారి మస్తాన్ వల్లి జిల్లా కలెక్టర్ కి సమర్పించడం జరిగినది. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ 18 లక్షల 70 వేల రూపాయలు దుర్వినియోగం పాల్పడిందున సర్పంచ్ నుండి రికవరీ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసారు. కావున అవినీతి చేసినటువంటి గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు దారుడు నేతి రామ్మోహన్ డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఫిర్యాదు దారుడు రామ్మోహన్ మాట్లాడుతూ విజిలెన్స్ వారు గత వారం విచారణ చేశారని త్వరలో నివేదిక సమర్పిస్తారని అప్పుడు ఎంత మొత్తంలో నిధులు దుర్వినియోగం జరిగిందని తెలుస్తుందని తెలిపారు. ఇవే కాకుండా గ్రామంలో వీధిలైట్లు, పారిశుద్ధం పేరిట పెద్ద ఎత్తున నకిలీ బిల్లులు పెట్టి పెద్ద ఎత్తున నిధులు ధ్రునియోగం చేశారని, దీనిపైన సమగ్ర విచారణ చేపట్టాలని లేనిచో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై ప్రధానమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగిందని త్వరలో దీనిపై విచారణ జరుగుతుందని ఫిర్యాదుదారుడైన నేతి రామ్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు.

ద్రు

Share this content:

Post Comment