ఊరు-వాడ గాజు గ్లాసు – ఇదే మన భవిష్యత్తు

రాజోలు, జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజుగ్లాసుని ప్రజలలోకీ తీసుకుని వెళ్ళడానికి జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు ఆద్వర్యంలో రాజోలు నియోజకవర్గం తాటిపాక సెంటర్లో ఊరు-వాడ గాజు గ్లాసు – ఇదే మన భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం ఉచితంగా గాజుగ్లాసులో టీ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, రాజోలు ఎంపీపీ కేతా శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాస్, మలికిపురం మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, మామిడికుదురు మండల అధ్యక్షులు జాలెం శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ రత్నమాల, రాజోలు ఎంపీటీసీ దార్ల కుమారి, బట్టెలంక ఎంపీటీసీ జ్యోతి సుబ్రహ్మణ్యం, సుధ మోహన్ రంగ, సలాది దొరబాబు, కోళ్ళ బాబీ, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన వీర మహిళలు, జనసైనికులు, టీడీపీ యువత పాల్గొన్నారు .