మన యువత కోసం మన భరత్

  • యువతకు అన్ని విధాలుగా అండగా ఉంటాం
  • కర్నూలుకు పరిశ్రమలు తీసుకు వస్తాం
  • యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి పెడతాం
  • యువతకు నిరంతరం ఉద్యోగాల కల్పన కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తాం
  • రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పై ప్రత్యేక దృష్టి పెడతాం
  • మన ప్రభుత్వం రాగానే ఎన్టీఆర్ విద్యోన్నతి తిరిగి అమలు చేస్తాం
  • టిడిపి జనసేన కూటమిని గెలిపించండి
  • మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తాం

కర్నూల్: కర్నూలు నగరంలోని సాయి వసంత్ కాంప్లెక్స్ నందు యువత కోసం భరత్ అన్న కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా టీజీ భరత్ యువతను ఉత్తేజపరిచారు.

యువతకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, కర్నూలుకు పరిశ్రమలు తీసుకు వస్తాం అని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి పెడతామని, యువతకు నిరంతరం ఉద్యోగాల కల్పన కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తాం అని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పై ప్రత్యేక దృష్టి పెడతాం అని యువతకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎండి హర్షద్ కర్నూల్ జనసేన కోఆర్డినేటర్, కోనేటి వెంకటేశ్వర్లు రాయలసీమ విద్యార్థి అధ్యక్షులు, పవన్ కుమార్ జనసేన ప్రోగ్రాం కన్వీనర్ రాయలసీమ 2, అదేవిధంగా స్టడీ సర్కిల్ ఫౌండర్ గోవింద్ ఆర్ఎస్ఎస్ అకాడమీ, పౌండరు విజయ్ పవన్ కళ్యాణ్ అభిమాన అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్ రెడ్డి, జనసేన పార్టీ వీర మహిళ అనిత శ్రీ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన పార్టీ నాయకులు కొణిదెల శ్రీనివాస్ రెడ్డి, ఎస్.కె రబ్బాని, శ్రీకాంత్, విజయ్ యాదవ్, అలిశెట్టి కిరణ్ కుమార్, మధు, కుమ్మరి మధు తదితరులు పాల్గొన్నారు.