మంగళగిరి మండలంలోని ఎర్రబాలెం గ్రామం నందుగల డాన్‌బాస్కో స్కూల్ సమీపాన పేదలకు పట్టాభిషేకం – ఎన్నో దశాబ్దాల కళ సాకారమైన వేళలో భాగంగా మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమానికి అధ్యక్షత వహించి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గొప్ప విజనరీ గురించి ప్రస్తావించిన ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి చైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు. రాష్ట్ర మంత్రివర్యులు మరియు స్థానిక శాసనసభ్యులు, యువగళం నిర్మాత, మన యువ నేత మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి కంకణం కట్టుకుని, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా పయనిస్తూ, ఎన్నో దశాబ్దాల పేదింటి ప్రజల కలలను సాకారం చేసేలా ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమాన్ని ఓ పండగ లాంటి వాతావరణాన్ని తలపించేలా ఇంటి పట్టాతో పాటు, సాంప్రదాయబద్ధంగా నూతన వస్త్రాలను బహుకరించి ఆ పేదింటి కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతూ, సంపూర్ణ భూహక్కుతో జీవనానికి ఓ భరోసాని కల్పించడం మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరి అదృష్టం. మన నియోజకవర్గంలో, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను కూడా త్వరితగతిన పూర్తిచేసి, పరిసర ప్రాంత ప్రజలకు అధునాతనమైన వైద్య సేవలను చికిత్స పద్ధతులను అందుబాటులోకి తీసుకువచ్చి, రాష్ట్రంలో మంగళగిరి అంటేనే అభివృద్ధికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్నారు. గత ప్రభుత్వంలో అరాచక మరియు రాక్షస పాలనతో ప్రజలను తీవ్ర ఇబ్బందులతో గురిచేసిన వైసిపి ప్రభుత్వాన్ని ఎండగడుతూ, కూటమి ప్రభుత్వంలో విద్య, వైద్య, ఐటి మరియు పలు రంగాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి, పి4 విధానాన్ని అమలుచేస్తూ పేదరిక నిర్మూలనకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలానే, గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీల అభివృద్ధికి దిశా నిర్దేశాలనిస్తూ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో నారా లోకేష్ తో పాటు మేము రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నాము. ప్రజలు అనేక సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు రాబోయేది మన ప్రభుత్వమే అంటూ అప్పుడే హామీ ఇచ్చారు నారా లోకేష్. కుటమీ ప్రభుత్వం ఏర్పడగానే ప్రతి పేదవాడికి అనగా ఇల్లు లేని వారికి ఇళ్ల పట్టా ఇస్తా అన్న హామీని ఈరోజు నెరవేర్చాము అది కళ్ళారా చూస్తున్నారు. గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుల్డోజర్ పరిపాలన చేశారు. రాత్రికి రాత్రి కరకట్ట వెంబడి ఇళ్లను కూల్ చేయటం జరిగింది. ఈ అరాచక పాలనను అప్పుడు మేము చూసి త్వరలో రాబోయే మా ఓటు మీ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఇంటికల నెరవేరుస్తామని మాట ఇచ్చి లోకేష్ 10 నెలల్లోనే 3000 మందికి ఇంటి పట్టాను మంజూరు చేయడం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక చరిత్ర సృష్టిస్తుంది అని చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్.డి.ఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment