అనకవోలులో “మన ఇల్లు – మన జనసేన”

సూళ్లూరుపేట నియోజకవర్గం, పెళ్లకూరు మండలం అనకవోలు, పెరుమాళ్ళపల్లి గ్రామాల్లో మరియు సంబంధిత ఆదివాసీ కాలనీల్లో ఉన్న సుమారు 340 పైగా కుటుంబాలను సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ నాయకత్వంలో సందీప్ కుమార్ ఆధ్వర్యంలో మన ఇల్లు – మన జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి కుటుంబాన్ని కలుస్తూ, స్థానిక సమస్యలు ప్రజలను నేరుగా అడగగా మాకు కరెంట్ లేదు, ముఖ్యంగా కొంతమంది దళారులు భూ భకాసురులుగా మారి చెరువు భూమిని ఆక్రమిస్తునారని, ఈ సమస్యలను పరిష్కరించండి వెంటనే అని మమ్మల్ని అడిగారు. ఖచ్చితంగా అధికారులతో మాట్లాడుతామని పరిష్కార దిశగా చర్చిస్తామని తెలిజేయయడం జరిగింది. అలానే పాలనలో మార్పు తీసుకురావాలి అన్న కోణంలో జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి 2024 లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయవలసిందిగా ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆనంద్ కుమార్, పవన్, సాయి, నందు, మహేష్, పవన్ కుమార్, పండు, దిలీప్ మరియు స్థానిక జనసైనికులు పాల్గొన్నారు.