ముత్తా శశిథర్ ఆధ్వర్యంలో మా ప్రాంతం – మా సచివాలయం – మన జనసేన

కాకినాడ సిటిలో జనసేన పార్టీ మా ప్రాంతం – మా సచివాలయం – మన జనసేన అనే నినాదంతో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా ముత్తా శశిథర్ ఆధ్వర్యంలో 20 ఏ వ వార్డు సచివాలయం పరిధిలో జనసేన పార్టీ జిల్లా కార్యక్రమాల నిర్వాహణ కమిటీ ఇంచార్జ్ ముంతా బద్రి నాయకత్వంలోను ఆ తరువాత 27 ఏ & బి వార్డు సచివాలయం పరిధిలో సిటీ కార్యదర్శి కుచ్చర్లపాటి అర్జున్ రాజు ఆధ్వర్యంలోను కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 20 ఏ సచివాలయ ప్రాంత ప్రజల సమస్యలు విన్న ముత్తా శశిధర్ స్పందిస్తూ ఎన్నో ఏండ్ల క్రితం పేద ప్రజలకు గూడు కల్పించాలన్న లక్ష్యంతో ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్.టి.ఆర్ గారి ప్రభుత్వ హయాములో పేదలను గుర్తించి ఒక్కక్కరికీ 110 గజాల స్థలాన్ని వారికి కేటాయిస్తు పట్టాలు వారి పేరుమీద అందించడం జరిగిందనీ, ఆనాటి పరిస్థితులను బట్టీ అలా కేటాయించారని, ఇప్పుడు ఆ స్థలం క్రమబద్దీకరణ చేయడానికి పది వేల రూపాయలను చెల్లించమనడం ఎంతవరకు సమంజసమన్నారు. తమ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే వీళ్ళందరికీ ఉచితంగా క్రమబద్దీకరించి వారి పేరున డాక్యుమెంట్లను అందచేసే ఏర్పాటు చేస్తామన్నారు. 27 ఏ & బి సచివాలయ ప్రాంత సమస్యలు విన్న ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఈప్రాంతంలో మోటారు ఫీల్డు సంబంధించిన శ్రామికులు నివసిస్తుంటారనీ, దేశ ప్రగతికి అహరహరం శ్రమించే నిబద్ధత వీరి సొంతమని అలాంటి వీరిపైన గ్రీన్ టాక్స్ పేరుతో అక్షరాలా పన్నెండు వేల రూపాయలు సాలీన వసూలు చేయడం అంటే వారి రక్తాన్ని జలగలా పీల్చేయడమే అని ఆక్ష్యేపించారు. వీరు తమ రవాణా సేవలతోనే కాక ప్రమాద సమయల్లో చూపించే చొరవ, తెగువ ప్రజలందరికీ తెలుసనీ దానికి సజీవ సాక్ష్యం ఇటీవల భారత ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురై మంటల్లో చిక్కుకుంటే మిగిలినవారిలా చూస్తూ ఊరుకోకుండా ధైర్యం చేసి ఒక బస్సు డ్రైవరు అతనిని కారుమంటలనుండీ రక్షించి ప్రాణదానం చేయడం, దానిని మెచ్చుకుంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అతనితో అల్పాహారం చేయడం దేశ ప్రజలందరికీ తెలిసిన విషయమే అని అన్నారు. అదే కాక కరోనాలాంటి విపత్కర వేళలో ప్రజల అవసరాలకోసం, ప్రాణాలు నిలపడం కోసం, తమ ప్రాణాలు, ఇల్లు, భార్య, పిల్లలు అని చూడకుండా అలుపెరగకుండా వాహనాలను నిత్యావసర సరుకులు, మందులతో రవాణా చేస్తూ మరియు ఆంబులెన్సులని నడుపుతూ చేసిన సేవలను మరువరాదన్నారు. వీరి సమస్యలపై జనసేన పార్టీ తరపున పోరాడతామని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో 20 ఏ సచివాలయ పరిధిలో లక్కోజు కామాక్షమ్మ, నూకారత్నం, నరవా అరుణ, కందాల శారద, పూడి వేణు, అడ్డాల శివ శంకర్, బలసాడి ప్రసాద్, కడారి శ్రీను, కొడగాలి కొండబాబు, కర్రి గంగాధర్ పాల్గొనగా, 27 ఏ & బి సచివాలయ పరిధిలో అబ్బాయి, వాసు, నాగేశ్వర రావు, రమేష్, వీరబాబు, నాగు, సుధీర్, సత్తిబాబు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.