మనస్టార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. చిరంజీవి తమ్మునిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి వరుసగా హిట్స్ కొట్టి తన ధీటైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. పవన్ అంటే దేవుడు అనే అభిమానులున్నారు. పవన్ అంటే నిజాయితికి మరో పేరు. పవన్ ను నటునిగానే కాక వ్యక్తిగతoగా అభిమానిoచే వారి సంఖ్య ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎదుటివారు కష్టoలో ఉన్నారంటే  చలించిపోయే మనసు కలిగిన పవన్, సాయం కావాలి అంటూ తన దగ్గరకు ఎవరు వచ్చినా లేదనకుండా సాయంచేయదానికి ముందుoటా రు. ప్రజలఫై ఆయనకున్న సేవాభావం, జాలి, దయ, లాంటి విషయాలు వివరించడానికి కొన్ని అక్షరాలు, పదాలు, మాటలు, పుస్తకాలలోని కొన్ని పేజీలు సరిపోవు. అలాగే  ఆయనకున్న ప్రజాదరణ మాటల్లో చెప్పడం సాద్యం కాదు.  ప్రముఖ తెలుగు సినీనటుడిగా, నిర్మాతగా, యుద్ధ కళాప్రావీణ్యుడిగా, దర్శకునిగా, రచయితగా, రాజకీయవేత్తగా తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ గురించి  కొన్ని విషయాలు మీకోసం.

పవన్ కళ్యాణ్ కొణిదల వెంకట్రావ్  శ్రీమతి అంజనా దేవి గారికి 1971 సెప్టెంబరు 2న జన్మిoచారు. పవన్ తండ్రి సొంత ఊరు మొగల్తూరు ఆయన ఉద్యోగరీత్యా చీరాలలో ఉన్నప్పుడు పవన్ పుట్టారు. పవన్‌కు ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు. తెలుగు సినిమా నటుడు మెగాస్టార్ చిరంజీవి పవన్‌కు పెద్దన్నయ్య. నటుడు, నిర్మాత అయిన కొణిదెల నాగేంద్ర బాబు పవన్‌కు రెండవ అన్నయ్య.

సినిమాకి పరిచయం:

పవన్, పరిశ్రమలోని అతని అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. ఇంటర్ మీడియట్ నెల్లూరు లోని కళాశాలలో పూర్తి చేసారు. పిమ్మట కంప్యూటర్స్ లో డిప్లోమా చేశాడు. ఇంటర్ మీడియట్ తో చదువుకు స్వస్తిచెప్పిన కళ్యాణ్, తరవాత మార్షల్ ఆర్ట్స్ మీద అభిమానాన్ని పెంచుకుని శిక్షణ తీసుకున్నారు. కళ్యాణ్ బాబు నుండి పవన్ కళ్యాణ్ గా పేరు మార్చుకుని 1996 లో ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’ సినిమాతో సినిమా ప్రపంచానికి పరిచయం అయ్యాడు.

తరవాత వచ్చిన గోకులంలో సీత, సుస్వాగతం చిత్రాలు హీరోగా నిలబెట్టాయి. 1999లో రిలీజ్ అయిన ‘తొలిప్రేమ’ లో బాలు పాత్ర యువతరాన్ని ఆకట్టుకుని స్టార్ హీరోగా ఎదిగారు.  పవన్ ఎప్పుడు ఏదో ఒక కొత్త స్టైల్ తో, వెరైటి సంభాషణలతో యూత్ ని కట్టిపడేస్తారు. సామాన్య ప్రజలే కాకుండా వెంకటేష్, మహేష్ బాబు లాంటి తోటి నటులు కూడా పవన్ ని ఇష్టపడటానికి కారణం కూడా అదే. పవన్ కళ్యాణ్ నటుడిగానే కాకుండా దర్శకుడుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. జపాన్ దర్శకుడు అకీరా కురసోవా ను అమితంగా ఇష్టపడే పవన్, ఆయన స్పూర్తి తో దర్శకుడుగా ‘జానీ’ చిత్రాన్ని రూపొందించాడు.

అభిమానులకు అయన ఫై స్వచ్ఛమైన ప్రేమ:

ఖుషి తర్వాత కొన్ని సoవత్సరాల పాటు ఆయనకు సరైన హిట్ లేదు. కానీ ఆయనకు అభిమానులు ఏ మాత్రం తగ్గలేదు. పవన్ అభిమానులకు సినిమా హిట్ తో సంబంధం లేదు తెరఫై పవన్ కనపడితే చాలు పండగే. సినిమా హిట్ అయితే అది ఇంకా పెద్ద పండుగ. పవన్కున్న చరిష్మా అటువంటిది. అభిమానులు ఆయన ఫై స్వచ్ఛమైన ప్రేమ అభిమానాలు కురిపిస్తారు.

గబ్బర్ సింగ్ సినిమాకు తెలుగులో ఉత్తమ నటునిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకొన్నారు. అత్తారింటికి దారేది సినిమా కలెక్షన్స్ లో అప్పటి వరకు తెలుగు సినీపరిశ్రమలోఉన్న రికార్డులన్నింటినీ తిరగ రాసింది. అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లతో సినిమాలు నిర్మించారు. 2015 లో గోపాల గోపాల చిత్రంలో మోడరన్ కృష్ణునిగా నటించారు. 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, 2016 ప్రారంభంలో కాటమరాయుడు సినిమాలలో నటించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 25వ చిత్రం ఆజ్ఞతవాసిలో నటించారు. త్వరలో వకీల్ సాబ్ తో అభిమానుల ముందుకు రాబోతున్నారు.

రాజకీయ జీవితం :

2014 మార్చి 14 న జనసేన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ జరిపారు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్లు పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. రాష్ట్రాన్ని విభజించినoదుకు కాంగ్రెస్ ను దోషిగా చూపుతూ, కాంగ్రెస్ ఎన్నికలలో గెలవకుండా పోరాడాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేశారు. జనసేనపార్టీతో మరోసారి రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ కల్యాణ్ 2014 సాధారణ ఎన్నికల్లో మోడీకి మద్దతు పలికారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మోడీకి మద్దతుగా టీడీపీ-బీజేపీ కూటమికి ప్రచారం చేశారు. పవన్ ప్రచారంతోనే టి.డి.పి ఏపీలో అధికారంలోకి రాగలిగినది. కాంగ్రెస్ హటావ్- దేశ్ బచావ్ అన్న ఆయన నినాదoతో అభిమానులు, ప్రజలు ఏపీలో ఒక్కసీటుకూడా కాంగ్రెసుకు దక్కనివ్వలేదు. 2019 లో జరిగిన ఎన్నికలలో జనసేన పార్టీని పోటీకి నిలిపాడు. తాను స్వయంగా భీమవరం, గాజువాకలలో రెండు చోట్ల పోటీ చేసారు. ఈ ఎన్నికలలో తాను రెండు స్థానాలలోనూ పరాజయం పాలవ్వగా జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానంలో గెలుపొందగలిగింది.

ప్రశ్నిoచడానికి ప్రజలలోకి  వచ్చి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడిన సమస్యలు:

ప్రశ్నిoచడానికి ప్రజలలోకి వస్తున్నాను అన్న పవన్ తను ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. సమాజంలో నెలకొన్న అనేక రుగ్మతల ఫై పవన్ స్పందించారు. తన సమస్యలు పైకి చెప్పుకోలేని పేదవారికి పవన్ గొంతై పలికారు. ప్రత్యేకహోదా, ప్రజల ఆరోగ్యం, మహిళల భద్రత, విద్యార్ధుల సమస్యలు, రైతుల కష్టాలు, భూముల ఆక్రమణ, నల్గొండ ఫ్లోరైడ్, చేనేతల సమస్యలు, మద్యం, ఉద్దానం, డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ప్రైవేటీకరణ వంటి ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాడు. ఉద్దానంలో కిడ్నీ భాదితుల కోసం విదేశాల నుండి డాక్టర్స్ ను రప్పించి పరిశోదనలు చేయిoచారు. వారికి మద్దతుగా నిలచేoదుకు 2018, May 25 న శ్రీకాకుళం లో నిరాహార దీక్ష చేసారు.

అవార్డులు:

నవంబరు 2017 లో ఇండో-యూరపియన్ బిజినెస్ ఫోరమ్ నుండి గ్లోబల్ ఎక్సెలెన్స్ పురస్కారం అందుకొన్నారు. నటుడిగా, రాజకీయవేత్తగా, సామాజిక సేవకుడిగా ఆయన చేసిన చేసిన సేవలకుగాను గుర్తించి ఈ అవార్డు ఇచ్చారు.