విజయవాడలో జనసేన ఆధ్వర్యంలో మన ఊరు మన ఆట

విజయవాడ తూర్పు నియోజకవర్గం: జనసేన పార్టీ ఆదేశాల మేరకు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మూడవరోజు 21వ డివిజన్ అధ్యక్షులు పోతిరెడ్డి రమణ మరియు రాష్ట్ర సహాయ కార్యదర్శి పోతిరెడ్డి అనితల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో వీరమహిళలు & స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి & తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు పాల్గొని ముగ్గుల పోటీలలో విజేతలుగా నిలిచిన వీరమహిళలకు బహుమతులను ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొవ్వూరి కిరణ్, ముళ్ళపూడి నాగేశ్వరరావు, మోహన్ ప్రసాద్, జీవీ, దివి శ్రీకాంత్, గుండు బాబ్జి, 19 డివిజన్ అధ్యక్షులు వటాల హరిప్రసాద్, 16వ డివిజన్ అధ్యక్షులు చందు శివరామకృష్ణ, జనసేన యువ నాయకులు దోమకొండ అశోక్, 8వ డివిజన్ అధ్యక్షులు మట్టా వివేక్, కమ్మిల రాజేశ్వరి, చందు సుజాత తదితరులు పాల్గొన్నారు.