మా ఊరు రోడ్ పోయింది.. దొంగలు ఎవరు?

పలమనేని నియోజకవర్గం, గంగవరం మండలం, కలగటూరు పంచాయతీలో దారి మాయం, బ్రిటిష్ కాలంనాటి నుండి ఉన్న రోడ్డు ఈరోజు లేదనడం ఆశ్చర్యంగా ఉంది. మా రోడ్డు మాకు కావాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై ప్రజలు తరఫున జనసేన నాయకులు సామల సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ గత టిడిపి, వైసిపి ప్రభుత్వాలలో ఇదే రోడ్డుకు గవర్నమెంట్ వర్కులు కూడా చేసి బిల్లు పెట్టారు. మరి వారి సొంత భూమిలో 100 ఇయర్స్ గా ఉన్నరోడ్డు ఎప్పుడు ఎందుకు లేదు అంటున్నారు, ఈ మర్మమేమిటి..?, జమీందారు పట్టాలో ఉన్న రోడ్డు ఇప్పుడు ఇలా మాయమైపోయింది?. ఎమ్మెల్యే గారు, అధికారులు స్పందించిని పక్షంలో జనసేన పార్టీ లీగల్ గా ఫైట్ చేస్తుందని సుబ్రహ్మణ్యం రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సునీల్, వెంకట్, అనిల్, నాని, చందు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.