సోషల్ మీడియా పోస్టులపై ఆగ్రహం: ఏపీ హైకోర్టు

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టింగుల తొలగింపునకు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వివిధ సామాజిక మాధ్యమ కంపెనీలకు హైకోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులిచ్చింది.

ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఆ తరువాత న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై వివిధ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు, పోస్టులు వచ్చాయి. వీటిపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు మేరకు ఏడుగురు వ్యక్తులపై సీఐడీ కేసులు కూడా నమోదు చేసింది. ఆ పోస్టుల్ని, వ్యాఖ్యల్ని చట్టప్రకారం తొలగించాలని.. సంబంధించిన యూఆర్ఎల్ లను కంపెనీలకు అందించాలని సీఐడీకు సూచించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్ శ్రీరాంను హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.